హాసిని రీ-ఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికితోడు అభినయమున్న హీరోయిన్లు తెలుగులో అరుదు. ఈరెంటితోపాటు చలాకీతనం ఉన్న హీరోయిన్ జెనీలియా. కళ్లతోనే భావాల్ని పలికించగల నైపుణ్యం ఆమె సొంతం. అప్పట్లో బొమ్మరిల్లు సినిమాతో అల్లరిభామగా పేరుతెచ్చుకొని అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు, ఇటు కుర్రకారుకి దగ్గరైంది. బాలీవుడ్ నటుడు రితీష్ దేశముఖ్‌తో వివాహమయ్యాక సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం జెనీలియా ఇద్దరు పిల్లల తల్లి. జెనీలియా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించబోతుందంటూ వార్తలొస్తున్నాయి. ఆమధ్య భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ‘వౌళి’ అనే మరాఠీ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసింది. తనస్థాయికి తగ్గ సినిమాలువస్తే దక్షిణాదిలో సైతం సినిమాలు చేయడానికి రెడీ అని ఆమధ్య ఒక స్టేజిమీద చెప్పింది. దీన్నిబట్టి చూస్తే జెనీలియా మళ్లీ తెలుగు తెరపై కనిపించే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట. ఆ రోజుల్లో తనదైన చలాకీతనంతో అందరి మనసులు దోచుకున్న జెనీలియా తెలుగులో ఎప్పుడు, ఏ ప్రాజెక్టుతో ఎలా రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.