ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్, ఇషారెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈనెల 7న విడుదల అవుతున్న సందర్భంగా నిర్మాత సుధాకర్‌రెడ్డి చెప్పిన విశేషాలు.. భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహం తట్టుకోవడం సాధ్యం అవుతుందా...? ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ఇది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ చిత్రం పరిశ్రమలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్‌లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడవేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రహ్మణ్యపురం’కు వర్క్ చేసారు. లెజండరీ బాలసుబ్రహ్మణ్యం పాడిన థీమ్‌సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఫైనాన్షియర్‌గా కొనసాగుతున్న నేను కథ నచ్చి నిర్మాతగా మారాను. నాకు కన్‌స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో మా వెంచర్స్ ఉన్నాయి. సినిమా అంటే నాకు ఆసక్తి. దాంతో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ప్రేక్షకులకు నచ్చే చిత్రాలను నిర్మించడమే నా ఉద్దేశం. ఈ సినిమా తప్పకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్‌లను అందిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాకు మరో ప్రత్యేకత రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది. ఈ సినిమాలో కథను నడిపించడంలో ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్రను పోషించనుంది. ఈ సినిమా తరువాత మరో రెండు కథలు విన్నాను.. త్వరలోనే దాని గురించి ప్రకటిస్తా. వరుసగా సినిమాలు తీయాలన్న ఆలోచన ఉంది అంటూ ముగించారు.