ఊపిరి పెద్ద హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్ నాగార్జున, ఆవారా కార్తి, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనే్న నిర్మించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’. తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం సెనే్సషన్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి. ఊపిరి చిత్రానికి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అనే టాక్ వచ్చిందని, ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని సూపర్‌హిట్ చిత్రాల్లో ‘ఊపిరి’ కూడా ఒకటి కావడం ఆనందగా ఉందని, స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ జరుగుతున్న టైమ్‌లో ఈ చిత్రం రిలీజ్ చెయ్యడం సరికాదన్న టాక్ ట్రేడ్‌వర్గాల్లో వినిపించిందని, కానీ దాన్ని అధిగమించామని అన్నారు. నాగార్జునకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన చిత్రంగా నిలచి ఈ సమ్మర్‌లో అత్యధికంగా కలెక్ట్ చేసే చిత్రం కాబోతోందని అన్నారు. ఈ చిత్రం చూసిన తరుణ్ ఆదర్శ్, సుభాష్ ఝా వంటి ఫిల్మ్ క్రిటిక్స్ ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఊపిరి కూడా ఒకటి అని అన్నారని, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ చిత్రం సాధించిన ఘనవిజయంపై ఆర్టికల్స్ ప్రచురించడం విశేషమని, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని అన్నారు. రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు ప్రదర్శించని బోట్స్‌వానా, టాంజానియా, కెన్యా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోకూడా ఈ చిత్రం ప్రదర్శింపబడి సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోందని, దీంతో మిగతా దేశాల్లోని ఎగ్జిబిటర్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. యు.ఎస్.లో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో నాన్ ప్రీమియమ్ టికెట్ ధరలతో ఒక మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని, అలాగే కర్ణాటకలో భారీ ఓపెనింగ్స్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందని చెప్పారు. క్లీన్ మూవీగా, ఫ్యామిలీ, ఫ్రెండ్లీ కంటెంట్‌తో రూపొందిన ఊపిరిని తెలుగులో ఓ లాండ్ మార్క్ మూవీ అని అందరూ ప్రశంసిస్తున్నారు అన్నారు.