ఫోర్బ్స్ జాబితాలో విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో రేర్ ఫీట్ సాధించాడు. 2018కిగాను అత్యధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 జాబితాలో విజయ్ చోటు సంపాదించాడు. ప్రముఖ మాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో విజయ్ దేవరకొండ 14 కోట్లతో 72వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో సౌత్ నుండి మరో సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 కోట్లతో మొదటి స్థానంలో నిలువగా, పవన్‌కళ్యాణ్ 31.33కోట్లు, తమిళ హీరో విజయ్ 30.33 కోట్లు, ఎన్టీఆర్ 28కోట్లు, విక్రమ్ 26 కోట్లు, మహేష్‌బాబు 24.33, సూర్య 23.67 కోట్లు, విజయ్ సేతుపతి 23.67 కోట్లు, నాగార్జున 22.65 కోట్లు, కొరటాల శివ 20కోట్లు, ధనుష్ 17.25 కోట్లు, నయనతార 15.17 కోట్లు, అల్లు అర్జున్ 15 కోట్లు, రామ్‌చరణ్ 14కోట్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఓవరాల్‌గా 100 మంది జాబితాలో సల్మాన్ ఖాన్ 253.25 కోట్లతో అగ్రస్థానంలో నిలువగా, విరాట్ కోహ్లి 228.09కోట్లు, అక్షయ్‌కుమార్ 185కోట్లతో రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.