యాక్షనే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుడు శీనుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ఆ తరువాతి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా ఆయన పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గ్లామర్ హీరోయిన్స్ కాజల్, మెహరీన్‌లు నటించిన ‘కవచం’ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు..
కొత్త దర్శకుడితో..
నేను ఇప్పటివరకు అందరు ప్రముఖ దర్శకులతో సినిమాలు చేశాను. అయితే శ్రీనివాస్ మామిళ్ళ ఇంతకుముందు చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా చేసిన అనుభవముంది. ఇక ఈ కథ ఆయన నాకు చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ బాగా నచ్చడంతో ఆయనతో సినిమాకు ఓకె చెప్పా. మేకింగ్ పరంగా తాను అద్భుతంగా తీశాడు.
పోలీస్ పాత్రలో..
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. తనమీద వచ్చిన ఆరోపణలను ఒక్క రోజులో ఎలా సాల్వ్ చేసుకొన్నాడనేదే ఈ కథ. స్క్రీన్‌ప్లే చాలా రేసీగా వుంటుంది. ట్విస్టులు అదిరిపోతాయి. ఒకరకంగా ఇది మైండ్ గేమ్. ఈ సినిమా సమయంలో చాలామంది అడిగారు, ప్రేమకథలు చేసే వయసులో ఈ యాక్షన్ ఎందుకని? ప్రేమకథలు మహా అయితే నాలుగైదు చేయొచ్చు. ఎక్కువ చేస్తే బోర్ కొట్టేస్తాయి. అదే యాక్షన్ అయితే చాలా కథలుంటాయి. దానికి స్పాన్ కూడా ఎక్కువ. బేసికల్‌గా నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం.
సినిమా గురించి..
థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. యాక్షన్‌తోపాటు పాటు అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటాయి. ఇక సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు ఎక్కడా డీవియేట్ కాకుండా రేసీ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటుంది.
బడ్జెట్ ఎక్కువగా..
నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు బడ్జెట్ ఎక్కువైన విషయం నిజమే. అయితే ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆల్రెడీ విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో 20కోట్లు వచ్చాయి. మొత్తం 10కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. కథ ప్రకారం గ్రాండ్‌గా ఉండాలన్నది నా ఆలోచన. అందుకే బడ్జెట్ పెరిగి ఉండొచ్చు.
తేజ దర్శకత్వంలో..
తేజ సినిమా షూటింగ్ పూర్తి అయింది. కేవలం 70రోజుల్లో చిత్రాన్ని పూర్తిచేశాం. ఇంకా మిగతా వర్క్స్ ఫినిష్ కావాలి. వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుంది.
ప్రస్తుతానికైతే ఇంకా ఏం ప్రాజెక్టులు అంగీకరించలేదు. రెండు, మూడు సినిమాలు లైన్లో వున్నాయి. త్వరలోనే వాటి గురించి చెబుతా.

-శ్రీనివాస్ ఆర్.రావ్