మహేష్‌తో మీనాక్షిదీక్షిత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. హైదరాబాద్- రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగు కొనసాగుతోంది. ఇక్కడ వేసిన విలేజ్ సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు కాలేజ్ స్టూడెంట్‌గా, కార్పొరేట్ సంస్థకి సీఈఓగా, గ్రామంలో రైతుల సమస్యలను పరిష్కరించే యువకుడిగా కనిపించబోతున్నాడు. మహేష్‌బాబు సరసన కథానాయికగా పూజాహెగ్డే అలరించనుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా సోనాల్ చౌహాన్ కనిపించనుందనే వార్తలు షికారు చేశాయి. తాజాగా తెరపైకి మీనాక్షి దీక్షిత్ పేరు వచ్చింది. త్వరలో ఈ సుందరి షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. గతంలో ఈమె బాడీగార్డ్, దూకుడు, బిల్లా2 వంటి కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసింది. సోనాల్ చౌహాన్‌తోపాటు ఈ అమ్మాయిని తీసుకున్నారా? లేదంటే సోనాల్ చౌహాన్ ప్లేస్‌లో తీసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి వుంది.