ఫెంటాస్టిక్ పెటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 165వ చిత్రం ‘పెటా’. షూటింగ్ చివరి దశకు చేరింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మరణ మాస్’ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. లిరికల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్ కావడం విశేషం. పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు పాడారు. ఇక సినిమా ఆడియో విడుదల వేడుకను డిసెంబర్ 9న నిర్వహించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, మెగా ఆకాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా విడుదలకానుంది.