సరికొత్త థాట్ శుభలేఖ+లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో వెరైటీ టైటిల్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్, ఇటు మార్కెట్‌లో బజ్ క్రియేటైంది. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లంకొండ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ శుభలేఖ+లు చిత్రానికి మ్యూజిక్ బాగా కుదిరిందని, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే చిత్రమన్నారు. దర్శకుడు శరత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తే, నిర్మాతలు పూర్తిసహకారం అందించారని, మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందు అందరికీ ఉండే టెన్షనే మాకూ ఉందని, అయతే ఇక్కడ కనిపిస్తున్న సహకారం చూస్తుంటే ధైర్యంగా ఉన్నామన్నారు. దర్శకుడు కొత్త థాట్‌తో చిత్రాన్ని తీర్చిదిద్దాడని, నిర్మాతల సహకారంతో కొత్త వాళ్లమే అయనా కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నారు. అప్ అండ్ డౌన్స్ ఎదురైనా, కెరియర్‌ని తీర్చిదిద్దుకోవాలని ఆశపడుతున్నానన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ బాగా కష్టపడ్డారని, డిసెంబర్ 7న వస్తున్న చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. యూత్‌కి, పేరెంట్స్ మధ్య ఉండే గ్యాప్, పిల్లలు పెళ్ళి విషయంలో ఎందుకు ఇండివిడ్యూలిటీ కోరుకుంటున్నారు అన్న పాయింట్‌ను సినిమాలో ప్రజెంట్ చేస్తున్నామన్నారు. ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పెళ్లిచూపులు సినిమా చూసినప్పుడు ఇంత చిన్న బడ్జెట్‌తో సినిమా తీయొచ్చా అనిపించింది. ఆర్‌ఎక్స్ 100కి, శుభలేఖ+లు కొన్ని సిమిలారిటీస్ కనబడుతున్నాయి. సినిమాలు తీయ్యడం ఒక ఎత్తయతే, వాటిని విడుదల చెయ్యడం మరో ఎత్తు. ఈ చిత్రంలో పనిచేసిన వారందరికీ ఆల్ ద బెస్ట్. 100 పర్సంట్ ఇక్కడే సక్సెస్ మీట్‌ను జరుపుకుంటారన్నారు.