కొంత సస్పెన్స్ మంచి సందేశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైరామ్‌వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం యు. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిర్మాత విశ్వనాథ్ మాట్లాడుతూ మొదట్లో కొన్ని టీవీ సిరియల్స్‌లో నటించాను. కొన్ని నిర్మించాను కూడా. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇప్పుడు విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ ‘యు’ నిర్మాంచానన్నారు. ఇకపై తమ బ్యానర్‌లో ఏడాదికి ఒక సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మంచి సినిమాలు చెయ్యాలన్నదే తన కోరిక అని, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు అవకాశం ఇస్తానని అన్నారు. ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానన్నానరు దర్శకుడు జైరామ్‌వర్మ చెప్పిన ‘యు’ కానె్సప్ట్ నచ్చి సినిమా ప్రారంభించామని, ఇందులో సస్పెన్స్‌తోపాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్స్ అంటూనే, సినిమాలో అంతర్గతంగా సందేశం ఉంటుందన్నారు. సినిమాలో ‘ఈ క్షణం..’ అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులో చిత్రీకరించామని, ఇటీవల విడుదలైన పాటకు మంచి స్పందన వచ్చిందన్నారు. సినిమా చూశాక ‘యు’ టైటిల్ ఎందుకుపెట్టామో అర్థమవుతుందన్నారు. హీరో హీరోయిన్లు కొత్తవారైనా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు.