వీడో గ్రేట్ బ్లఫ్‌మాస్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. అభిషేక్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. సత్యదేవ్, నందితాశే్వత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్య కృష్ణన్, టెంపర్ వంశీ, దిల్మ్రేశ్ కీలక పాత్రధారులు. గోపీ గణేష్ పట్ట్భా దర్శకుడు. చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శివలెంక మాట్లాడుతూ సెన్సార్ యు/ఎ వచ్చింది. డిసెంబర్ 28న సినిమా విడుదల చేస్తాం. సమాజ స్థితికి దగ్గరగా ఉన్న సినిమా. బ్లఫ్ మాస్టర్ల చేతిలో పలువురు మోసపోతున్నారు. అదే విషయాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. సునీల్ కశ్యప్ సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉంది. హీరో వర్సటైల్ ఆర్టిస్ట్. ప్రజల్లో అవేర్‌నెస్ తెచ్చే సినిమా ఇది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. 20 నిమిషాల సినిమాను పృథ్వి భుజాలపై మోసాడు. హిల్‌స్టేషన్స్ షూట్‌లో ఎక్కడా విసుక్కోకుండా సహకరించాడు. చైతూ, సత్య బాగా చేశారు. పులగం స్పెషల్ డైలాగులు అందించారు’ అన్నాడు. హీరో మాట్లాడుతూ ‘మోసపోయే వాళ్లు ప్రస్తుత సమాజంలో చాలామందే ఉన్నారు. ఈ సినిమాలో మోసపోయే వాళ్లల్లో నేనూ ఒకడిని. ఒక కంపెనీలో 20 మందిని జాయిన్ చేస్తే, వాళ్లు మోసపోతారు. ఆ 20 మంది నన్ను పట్టుకుంటారు. అదీ నా పాత్ర. దో నెంబర్ బిజినెస్. మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తారు. గోపీ బాగా తీశారు. శివలెంక కృష్ణప్రసాద్ పెద్ద నిర్మాత. నాలాంటి వాడిని ఎంకరేజ్ చేసి అవకాశాలివ్వడం చాలా హ్యాపీ. నాతోపాటు చేసిన చైతూ గొప్ప నటుడు. నేను చెప్పడం కాదు, అతను ప్రూవ్ చేసుకున్నాడు’ అన్నారు.