టాప్ గ్రూప్ సాంగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం మహర్షి. కథాపరంగా సినిమాలోని కొంత భాగాన్ని విదేశాల్లోనూ, మరికొంత భాగం ఇండియాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్‌లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండువారాలపాటు ఇక్కడ షూటింగ్ కొనసాగిస్తారట. మహేశ్ బాబు ఇంతకుముందు చేసిన భారత్ అనే నేనులో వచ్చాడయ్యో సామీ సాంగ్ ఎంతగా జనంలోకి దూసుకెళ్లిందో తెలిసిందే. అంతకుమించి గ్రూప్ ఒకటి ఈ చిత్రం కోసం ప్లాన్ చేసినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్లోనే ఈ సాంగ్‌ను కూడా చిత్రీకరిస్తారని వినికిడి. పూజా హెగ్దె కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో అల్లరి నరేశ్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.