మళ్లీ.. కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీకట్టిన కాజల్ ‘కవచం’లో మంచి కెమిస్ట్రీని రుచి చూపించింది. త్వరలో దర్శకుడు తేజతో బెల్లంకొండ చేయబోయే ప్రాజెక్టులోనూ మరోసారి రొమాన్స్ చేయడానికి కాజల్ రెడీ అవుతోందట. కవచంలో శ్రీనివాస్, కాజల్ పెయిర్ ఆకట్టుకున్నా -సినిమా మాత్రం ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయలేకపోయింది. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల కమర్షియల్ కంటెంట్‌ను కథగా మలచుకున్నా, స్క్రీన్‌పై నేరేట్ చేయడంలో విఫలమైన కారణంగా ‘కవచం’ సాదాసీదా అనిపించింది. సాధారణ పోలీస్ కథలను రాజశేఖర్, వెంకటేష్, సూర్య, జూ.ఎన్టీఆర్, మహేష్‌బాబులాంటి హీరోలు చాలా ముందుకు తీసుకెళ్లిపోయారు. పోలీస్ స్టోరీ అనగానే వేగం, అంతుచిక్కని మైండ్‌గేమ్‌తో సాగిపోయే కథలుగా ఆడియన్స్‌కి అలవాటు చేశారు. అలాంటి సినిమాలను రుచి చూసిన ఆడియన్స్‌కి -సాదాసీదా కవచం కనెక్ట్ కాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్‌కి లోటులేకున్నా -కథలో బిగింపు లేకపోవడం ఆడియన్స్‌ని నిరుత్సాహపర్చింది. అయితే సాయి, కాజల్ మధ్య మంచి కెమిస్ట్రీ పండటంతో, ఇప్పుడు తేజ ప్రాజెక్టులో సైతం ఆమెకు చోటుదక్కిందని అంటున్నారు. మరో విశేషమేమంటే కవచం మాదిరిగానే ఈ కథ కూడా కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. అందుకోసం టైటిల్‌నే ‘సీత’ అని పెట్టే అవకాశం లేకపోలేదు. కాజల్ పాత్రనుబట్టే టైటిల్ ఉంటదన్న తేజవద్ద శ్రీనివాస్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని అంటున్నారు. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర్నుంచీ యాక్షన్, రిచ్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న హీరో శ్రీనివాస్, మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రంలో ఎలా కనిపిస్తాడన్న ఆసక్తి కనిపిస్తోంది.