‘యు’ నిలదీస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవెరా, హిమాన్సి కాట్రగడ్డ హీరో హీరోయిన్లుగా కొవెరా దర్శకత్వంలో విజయలక్ష్మీ కొండా నిర్మించిన చిత్రం ‘యు’. కథే హీరో ట్యాగ్ లైన్. మ్యూజిక్ లాంచ్‌లో భాగంగా ఆడియో సీడీలను హీరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సత్య మహావీర్ మాట్లాడుతూ కొవెరాతో పనిచేయడం హ్యాపీగా ఉంది. అద్భుతమైన ఐడియాతో తయారు చేసుకున్న కానె్సప్ట్ ఇది. సులభమైన రీతిలో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేలా తెరకెక్కించారు. బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ బాగా కుదిరిందని, ప్రతివ్యక్తీ దేశానికి ఏదోకటి చేయాలన్న ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుందన్నాడు. వందేమాతరాన్ని కొత్త పంథాలో ప్రేక్షకులకు అందిస్తున్నట్టు చెప్పాడు. హీరో, దర్శకుడు కొవెరా మాట్లాడుతూ బన్నీ, అఖిల్, శ్రీవిష్ణు ఇలా చాలామందికి కథలు చెప్పాను. ఓ డైరెక్టర్ హీరోను ఎలా ఒప్పిస్తాడు అన్న ఆలోచనల నుంచి పుట్టించే ఈ సినిమా. కథ బావుంటే డైరెక్షన్‌కు అవకాశమివ్వరు. వారితో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే మనల్ని నమ్మి ఓ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు. ఆ రిస్‌క డైరెక్టర్ భరిస్తాడా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తారు. రాజవౌళి 400 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎందుకు చేయగలిగాడంటే, అంతరి రిస్క్ తీసుకోగలిగే సామర్థ్యం ఉంది కనుక. రిస్క్ తీసుకునే దర్శకుడికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. అందుకే ఎవరూ తీసుకోని రిస్క్ నేను తీసుకున్నా. నేనే హీరోగా, నిర్మాతగా, దర్శకత్వం చేసుకున్నా. నా కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే అనుకుంటున్నా’ అన్నాడు. తను ధైర్యంగా ముందడుగు వేయడానికి పరోక్షంగా సహకరించిన నాని, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఐపీఎల్ బెట్టింగులు, ప్రముఖ వ్యక్తులు బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న కోట్ల రూపాయల రుణ వ్యవహారాలు, ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల టర్నోవర్.. ఇలాంటి వ్యవహారాల్లో డబ్బెక్కడిదన్న అంశాన్ని సినిమాలో ప్రస్తావించామన్నారు.