బాహుబలి రేంజ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణి సృజనకు ఓ లెక్కుంటుంది. అది స్క్రీన్‌కు ఎక్కన తరువాతే ఆడియన్స్‌కి అర్థమవుతుంది. నవాబ్‌తో సంతృప్తి పొందని మణి, ఓ రేంజ్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలిని మించి ఉండొచ్చన్నది ఓ అంచనా.
నవాబ్‌తో తనలో టెక్నీషియన్‌ని ప్రూవ్ చేసుకున్న మణిరత్నం తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకునే గట్టి సబ్జెక్టు కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. కాకపోతే రెగ్యులర్‌గా వెళ్లే కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా ఈసారి కాస్త వినూత్నంగా హిస్టారికల్ జానర్‌వైపు వెళ్తున్నట్టు సమాచారం. తమిళనాట కల్కి కృష్ణమూర్తి సుప్రసిద్ధ రచయిత. ఆయన రాసిన పొనియన్ సెల్వన్ అనే చారిత్రాత్మక నవల ఐదు భాగాల్లో ఉంటుంది. మొత్తం రెండున్నర వేల పేజీల్లో ఉండే ఆ నవల అప్పట్లో అమిత ఆదరణకు నోచుకుంది. ప్రాచీన సాహిత్య సారాంశంగా తొలి తరానికి చెందిన రాజరాజ చోళన్ కథే ఈ పొన్నియన్ సెల్వన్. గతంలో ఏంజీఆర్‌లాంటి స్టార్లు దీన్ని చిత్రంగా మలిచేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇన్నాళ్లకు మణిరత్నంకు ఇది రూపొందించే చాన్స్ దొరికిందట. చియాన్ విక్రంతో దీన్ని సౌత్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. షూటింగ్ మొదలుకావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆలోపు పక్కా స్క్రిప్ట్‌తో ఫ్రీ ప్రొడక్షన్ రెడీ చేస్తున్నట్టు తెలిసింది. హీరోయిన్, టెక్నికల్ టీం వివరాలు తెలియడానికి ఇంకా టైం ఉంది. మణిరత్నం, విక్రం కాంబోలో గతంలో విలన్ వచ్చింది. ఐశ్వర్యరాయ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం డిజాస్టర్ అనిపించుకుంది. కాని విక్రం పెర్ఫార్మెన్స్‌కి మంచి పేరు వచ్చింది. ఈసారి అలా జరగకుండా బాహుబలి రేంజ్‌లో ఈ పొన్నియన్ సెల్వన్‌ని తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది.