ఆకట్టుకునే ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కెఎల్ రాజు నిర్మిస్తున్న చిత్రం -అగనగా ఓ ప్రేమకథ. విరాజ్ జె అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కెఎల్‌ఎన్ రాజు మాట్లాడుతూ ‘మంచి ప్రేమ కథ. అశ్విన్, రిద్ది, రాధాబంగారు సహా నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకరాంతో మంచి ప్రేమ కథను తెరకెక్కించాం. సినిమా బాగా వచ్చింది. ఓ కూతురిని మంచి దారిలో పెట్టడానికి తండ్రి ఏం చేశాడన్నదే మెయిన్ పాయింట్. డిసెంబర్ 14న సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు.
దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి మాట్లాడుతూ ‘మంచి క్యూట్ లవ్ స్టోరీ. ఆహ్లాదకరంగా ఉంటుంది. కెఎల్‌ఎన్ రాజు సహకాంతో సినిమాను పూర్తిచేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 14న విడుదలవుతున్న మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకముంది’ అన్నారు. సునయన మాట్లాడుతూ ‘కెఎల్‌ఎన్ రాజు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశారు. సినిమా కోసం అందరూ కష్టపడ్డాం. ఈనెల 14న మా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’ అన్నారు.
విరాట్ జె అశ్విన్ మాట్లాడుతూ ‘నిర్మాత సహకరించకుంటే సినిమా లేదు. ఆయన బ్యానర్‌లో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటాను. మార్తాండ్ కె వెంకటేశ్ ప్రాజెక్టుకు ఎంతగానో సపోర్ట్ చేశారు. డిసెంబర్ 14న విడుదలవుతున్న చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. రిద్దికుమార్ మాట్లాడుతూ ‘తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రమిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను’ అంది. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.