తెలుగు నేర్చుకుంటా...సెటిలవుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యతేజ, హర్షిక పునచ్చా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్‌కుమార్ జంపా నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ హర్షికా పునచ్చా తెలిపిన విశేషాలు...ఆమె మాటల్లోనే..
కన్నడ సినిమా చూసే
తెలుగులో ఇది నా మొదటి సినిమా. ప్రదీప్‌కుమార్ బెంగుళూరులో నా సినిమా చూసి ఈ అమ్మాయి బాగా చేసింది, మన సినిమాలో హీరోయిన్‌గా సరిపోతుందని నన్ను కాంటాక్ట్ చేశారు. అలా ఈ సినిమా అవకాశం దక్కింది.
నా గురించి
స్వతహాగా కన్నడ అమ్మాయిని నేను. నాన్న ఆర్మీలో పనిచేస్తారు. అమ్మ సిప్లాలో పనిచేసేది. ఇప్పుడు అక్కడ మానేసి నాతోపాటు ఉంటోంది. నేను ఇంజనీరింగ్ చేశాను. నా 16వ ఏటనుండి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటికే 10, 12 సినిమాలు చేశా. ఇన్ని రోజులు తెలుగు భాషపై దృష్టి పెట్టకపోవడానికి స్టడీస్. కాని ఇప్పుడు టార్గెట్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలి. ఎందుకంటే టాలీవుడ్ బాలీవుడ్ తరువాత పెద్ద పరిశ్రమ. ఇక్కడి మార్కెట్ పెద్దది. ఇలాంటి ఇండస్ట్రీలో పనిచేయడం అదృష్టంగా ఉంది.
నచ్చిన పాత్ర
ఈ సినిమాలో నేను రిచ్ అమ్మాయి అయినా కూడా ఆ బిల్డప్ ఏమీ లేకుండా సాదా సీదా అమ్మాయిగా కనిపిస్తాను, చాలామంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిగా. ఈ సినిమాకు ముందు చాలా అవకాశాలు వచ్చాయి. కాని ఈ పాత్ర బాగా నచ్చడంతో సినిమా చేశా. ఇందులో హీరో సూర్యతేజ్‌లో మంచి టాలెంట్ వుంది. తనకు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా ఇది.
అన్ని హైలెట్స్
ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి విజయం సాధించాయి. మంచి ఆడియో వచ్చింది. ‘లోఫర్’ తరువాత సునీల్ కశ్యప్ అందించిన ఈ పాటలతో మా సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి.
నటిగా ప్రూవ్ చేసుకోవాలనే
హీరోయిన్‌గా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవ్వడం ఇష్టం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకునే సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటికే రెండు మూడు సినిమా అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తరువాత వాటి గురించి ఆలోచిస్తారు. తెలుగులో నాకు పవన్, మహేష్‌లంటే చాలా ఇష్టం.

-శ్రీ