స్పీడుపెంచిన డియర్ కామ్రేడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం గత కొద్దీరోజులుగా కాకినాడలో నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుకుంటుంది. దాంతో ప్రస్తుతం 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌లో విజయ్, రష్మికలపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్‌గా కనిపించనున్నాడు. నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కిస్తున్నాడట. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది. గీతగోవిందం తరువాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి.