రెండో ప్రేమకథా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్‌చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సస్ సాధించిన ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.3గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్-2. హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి కోటి 43 లక్షలకు శాటిలైట్ హిందీ డబ్బింగ్ రైట్లు దక్కించుకుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శే్వత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఆర్ సుదర్శన్‌రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమా మొదటి లుక్‌ని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూరె్తైంది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తున్న ఈ చిత్రానికి నందిత శే్వత నటన సూపర్ ప్లస్సవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేమకథాచిత్రమ్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అదే హవాని ట్రేడ్‌లో సీక్వెల్‌గా వస్తున్న ప్రేమకథా చిత్రమ్-2 కూడా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్‌ని కోటి నలభై మూడు లక్షలకి కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో నందిత శే్వత మెయిన్ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిద్ధిఇద్నాని మరో హీరోయిన్‌గా చేస్తున్నారు. విధ్యుల్లేఖ, ప్రభాస్ శ్రీనుల మధ్య వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. జనవరిలో విడుదలకానున్న ఈ చిత్రం యొక్క టీజర్‌ని అతి త్వరలో విడుదల చేస్తాం. పూర్తి సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మా ప్రేమకథా చిత్రమ్-2 అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు.