యేలేటితో రానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమాలో ప్రభాస్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో రానాకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. అయితే రానా నటించిన సినిమాలు ఈ ఏడాది ఒక్కటి కూడా విడుదలకాలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. వచ్చే సంవత్సరం వరుసగా ఆయన నటించిన సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకి సంబంధించిన చిత్రాలలో రానా నటిస్తుండగా, వచ్చే ఏడాది ఈ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడితో రానా మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే, అనుకోకుండా ఒకరోజు, మనమంతా వంటి కుటుంబ కథాచిత్రాలు తెరకెక్కించిన చంద్రశేఖర్ యేలేటితో రానా సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. చంద్రశేఖర్ ఏలేటి ఇటీవలే రానాకు కథను వినిపించాడట. రానాకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ మూవీకి మైత్రి మూవీమేకర్స్ సంస్థవారు నిర్మాతగా వ్యవహరించనున్నారు.