హాటెస్ట్ వెజిటేరియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో హాటెస్ట్ వెజిటేరియన్స్ ఎవరు? అంటూ పెటా తరఫున ఓ వెబ్‌సైట్ నిర్వహించిన వోటింగ్‌లో హీరోయిన్ అనుష్క శర్మ, కార్తిక్ ఆర్యన్ టైటిల్స్ కొట్టేశారు. 2015లోనే హాటెస్ట్ ఫిమేల్ వెజిటేరియన్‌గా టైటిల్ అందుకున్న అనుష్క, ఇప్పుడు రెండోసారీ తన సత్తా చాటింది. 2017లో పెటా భారత పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సాధించిన అనుష్క, ఆ తరువాత పెటా ప్రచారంలో కీలక భూమిక పోషించింది. ‘ఐయామ్ అనుష్క. ఐ యామ్ ఏ వెజిటేరియన్’ అంటూ తనదైన స్టైల్‌లో పెటా మూమెంట్‌కు మంచి బలాన్నిచ్చింది. అటు ముంబయిలోనూ మూగ ప్రాణుల సంరక్షణకు తనవంతు సహకారం అందించేందుకు అనుష్క సొంతంగానూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. జంతు పునరావాస శిబిరాన్ని ఒకటి ముంబయి పరిసరాల్లో ఏర్పాటు చేసే ఆలోచనలో అనుష్క ఉంది. అంతేకాదు, వేడుకల సమయంలో మనిషి తన ఆనందం కోసం చేస్తున్న కొన్ని చేష్టలు పెంపుడు జంతువులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని, వాటినీ వాటి మానాన బతికే హక్కుపై మనిషి దృష్టి పెట్టాలని అనుష్క పిలుపునిస్తోంది. ముంబయిలో గుర్రపు బగ్గీలపైనా నిషేధం విధించాలని కోరుతుంది. ‘నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయాల్లో వెజిటేరియన్ కావడం ఒకటి. వెజిటేరియన్ ఆరోగ్య సూత్రమే కాదు, అధిక బలాన్నిచ్చే ఆహరం కూడా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను తీసుకునే ఆహారం వల్ల నాతోపాటు భూమీద బతుకుతున్న ఏ మూగ ప్రాణీ ఇబ్బంది పడదు’ అంటోంది అనుష్క. హటెస్ట్ వెజిటేరియన్ టైటిల్ సొంతం చేసుకున్న కార్తిక్ ఆర్యన్ మాట్లాడుతూ మనిషికి ఆహారంగా మారిపోతున్న జంతువులు ఎలాంటి నరకాన్ని అనుభవిస్తున్నాయో తెలియజెప్పే ఒక వీడియో యాదృచ్చికంగా చూశాను. మనసు చలించిపోయింది. అది మొదలు వెజిటేరియన్‌గా మారిపోయాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ మై ఫుడ్ నౌ’ అంటున్నాడు. ‘వాళ్ల ప్లేట్లలో మాంసాహారాన్ని త్యజించి అనేక జంతువులకు ప్రాణభిక్ష పెడుతున్న వాళ్లలో హాట్ సెలబ్రిటీస్ అనుష్క, ఆర్యన్. అందుకే పెటా బుక్‌లో వాళ్లకు చోటిచ్చి, టైటిల్ వాళ్లకు ప్రకటించాం’ అని పెటా అసోసియేట్ డైరెక్టర్ సచిన్ బంగెర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.