మిలమిల..కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాక్మే ఫ్యాషన్‌వీక్ ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ వేడుకకోసం ఫ్యాషన్ ప్రపంచం కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. విశ్వవిఖ్యాతిగాంచిన 90మంది డిజైనర్లు ఈ షోలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు తరలివచ్చారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టిన మరో 24మంది డిజైనర్లు, మోడల్స్ ఆతృతగా ఎదురుచూసే ఈ వేడుక బాలీవుడ్ తారల తళుకుబెళుకులతో కళకళలాడింది. ప్రఖ్యాత భారత డిజైనర్ మనీష్ మల్హోత్ర రూపొందించిన ‘ఎలిమెంట్స్’ దుస్తులతో బాలీవుడ్ భామలు ర్యాంప్‌పై హొయలుపోయారు. ఈ యాభైఏళ్ల డిజైనర్ మనీష్ దుస్తులకో బాలీవుడ్‌లో పెద్దక్రేజ్ ఉంది. పంచభూతాలకు ప్రతీకలుగా ఆయన రూపొందించిన దుస్తులతో అందాల తారలు మిలమిలామెరిశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనకపూర్‌ఖాన్, దియామీర్జ, శ్రీయాశరణ్ సహా పలువురు తారలు మనీష్ రూపొందించిన దుస్తులతో అలరించారు. ఫరాఖాన్, భూమి పెడ్నేకర్, పెర్నియా ఖురేషి, సంగీత బిజ్లాని, జోయాఅక్తర్, సూరజ్ పంచోలి, ఆశిష్‌చౌదరి తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుక ఏప్రిల్ 3వ తేదీవరకు కొనసాగుతుంది. దేశవిదేశాలనుంచి ప్రఖ్యాత డిజైనర్లు నీర్ లుల్లా, నిఖిల్ థాంపి, అనితాదోంగ్రి, మొనిషాజైసింగ్, రాహుల్‌మిశ్ర, మసబ్‌గుప్త, పాయల్‌సింఘాల్, రాజేస్ ప్రతాప్‌సింగ్‌సహా పలువురు ఈ ఫ్యాషన్‌వీక్‌కు హాజరవుతారు.