సిద్ధమైన మిస్టర్ మజ్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ పాట మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. సినిమా పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి రిపబ్లిక్‌డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’అన్నారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.