బాలయ్య టైటిల్‌తో నరేష్ బుల్లోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లరి నరేష్. ఈ మూవీలో మహేష్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించబోతున్నాడు ఈ సుడిగాడు. ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే తను హీరోగా మరో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి బాలయ్య టైటిల్‌ను కన్సిడర్ చేస్తున్నారు. అనిల్ సుంకర నిర్మాతగా మరో సినిమా చేయడానికి అంగీకరించాడు అల్లరి నరేష్. గిరి ఈ సినిమాకు దర్శకుడు. గతంలో ఇతడు నందిని నర్సింగ్‌హోం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు గతంలో బాలయ్య నటించిన బంగారుబుల్లోడు సినిమా టైటిల్‌ను పెట్టాలని అనుకుంటున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో బంగారుబుల్లోడు సూపర్ హిట్ మూవీ. అల్లరి నరేష్ సినిమాతో ఆ టైటిల్ మరోసారి రిపీట్ కాబోతోంది. గతంలో సుందరకాండ, యముడికి మొగుడు, అహనా పెళ్లంట లాంటి హిట్ సినిమా టైటిట్స్‌ను వాడేశాడు అల్లరోడు.