నల్లమలలో వజ్రాలవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్, సుమి ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్. ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వజ్రాలవేట’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఒకేసారి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో ముందుకు వెళ్లిన హీరోహీరోయిన్లు, విలన్లకు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి, అడవిలోకి వెళ్లిన నేపథ్యంలో కథనం ఎలా సాగింది? అనే అంశాలతో ఈ చిత్రాన్ని ఛేజింగ్స్ ప్రధారంగా రూపొందించామని తెలిపారు. మహానంది, నంద్యాల, ఓర్వకల్లు, కర్నూలు తదితర ఫారెస్ట్ పరిసరాల్లో చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించామని, హీరోవిలన్ల మధ్య పోరాట సన్నివేశాలను 70 మంది ఫైటర్లతో చిత్రీకరించామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
గిడ్డేష్, సమీర, వినోద్‌కుమార్, శివసత్యనారాయణ, హుస్సేన్, మహేశ్వరాచారి, నందిని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బి.వి.రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్‌చంద్ర.