ఫాంలో ఉన్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో విజయ్ దేవరకొండ మరో ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇటీవల ‘నోటా’తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ చిత్రంతో పరాజయం చవిచూశాడు. ఇక తాజాగా ఆయన డ్రీం వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్‌ఆర్ ప్రభు నిర్మాణంలో రెండో చిత్రంలో నటించనున్నాడట. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించనున్న చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ రాహుల్ రామకృష్ణ, అలాగే తమిళ రైజింగ్ కమెడియన్ యోగిబాబు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్‌లోవున్న చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు ఆయన ‘మళ్ళీమళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.