దుమ్మురేపుతున్న దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాలు, ప్రయోగాత్మక చిత్రాలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ హీరో -కార్తి. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యమైన పాత్రలతో మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్తున్నాడు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో బైక్ రేసర్ క్యారెక్టర్‌తో వస్తున్న కార్తి, తరువాతి ప్రాజెక్టుల్లోనూ ప్రత్యేకత కనిపించే పాత్రలే ఎన్నుకుంటున్నాడట. ఇక తాజాగా విడుదలైన దేవ్ తొలి లిరికల్ వీడియో ఇప్పుడు దుమ్ము లేపుతోంది. గతంలో ఖాకీలో జతకట్టి మంచి కెమిస్ట్రీ పండించిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కార్తితో ఈ చిత్రం కోసం జతకట్టింది. హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన దేవ్ నుంచి తాజాగా లిరికల్ వీడియో విడుదల చేశారు. ‘చెలియా అడుగుదామా చలిని కాస్త పెరగమని/ సఖియా తెలుపుదామా సుధనే కాస్త పొంగమని’ అంటూ చంద్రబోస్ రాసిన ఫాస్ట్‌బీట్ సాంగ్‌ను హరిహరన్, భరత్‌సుందర్, అర్జున్ చండి, క్రిష్, శరణ్య గోపీనాథ్ ఉత్సాహంగా ఆలపించారు. విడుదలైన కొద్దిసేపటికే కుర్రకారు మైండ్‌లో హమ్మింగ్ నడుస్తుందంటే -సాంగ్ బాగా కనెక్టైనట్టే. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కార్తి, రకుల్ హీరోయిన్లుగా గతంలో వచ్చిన ఖాకి మంచి విజయాన్ని అందుకోవడంతో, వీళ్లిద్దరి కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి. రేసర్‌గా వస్తున్న దేవ్ -ఈసారి తెలుగులో ఎలాంటి రేసింగ్ చూపిస్తాడో చూడాలి. ఇదిలావుంటే, తరువాతి ప్రాజెక్టులో లవ్వూ గివ్వూలేని పాత్ర ఒకటి చేస్తున్నాడట. దక్షిణాది సినిమాలు ఎక్కువశాతం కమర్షియల్ ఫార్మాట్లోనే తెరకెక్కుతాయి. అంటే హీరో, హీరోయిన్, విలన్ కంప్లసరీ. కనీసం విలన్‌లేని స్టోరీ ఉండొచ్చేమోగానీ, హీరోయిన్ లేని సినిమాను మనవాళ్లు ఊహించుకోవడమే కష్టం. అయితే కార్తి మాత్రం కావాలనే అలాంటి చిత్రానికి ఒప్పుకున్నాడట. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని, సినిమాకు హీరోయిన్ పాత్ర అవసరం లేదంటున్నారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ‘మానగరం’లాంటి చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్, తరువాతి కార్తి చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. హీరోయిన్ లేదంటే లవ్వూ గివ్వూ లేదు. పెళ్లి గిళ్లి జాన్తానై. హీరో ఫుల్‌గా యాక్షన్ మోడ్‌లో ఉంటాడట. కార్తి ఈమధ్యే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ‘చినబాబు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేశాడు. త్వరలో విడుదల కానున్న దేవ్ సినిమా ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దేవ్ తరువాత లోకేష్ కనగరాజ్‌తో కార్తి చేయనున్న సినిమా నిజానికి ప్రయోగమే. హీరోయిన్ లేని ఇలాంటి సినిమాతో ప్రేక్షకులను ఏమేరకు కార్తి మెప్పిస్తాడో చూడాలి.