జర్నీ-2 అంతా సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై గణేష్, మంజరి జంటగా రూపొందించిన ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులో జర్నీ-2గా అనువదిస్తున్నారు. కన్నడంలో విజయవంతమైన ముంజాని చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధర్ చౌదరి అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ స్వార్థంలేని నిజమైన ప్రేమ ఎంతో గొప్పదని, అలాంటి ప్రేమ ఎవరికి, ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరని, వాస్తవానికి తొలి చూపులోనే ప్రేమ అంకురిస్తుందన్న దానికి వ్యతిరేకంగా ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. ఒకరిని ఒకరు చూసుకొని ప్రేమికులు చివరికి ఎలా కలుసుకున్నారు? అన్న కథాంశంతో ఆద్యంతం సస్పెన్స్‌తో సాగే ఈ చిత్రం కన్నడ దేశంలో విజయఢంకా మ్రోగించిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్న నమ్మకంతో తెలుగులో అందిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం త్వరలో విడుదల చేయడానికి సిద్ధవౌతోందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెనె్నలకంటి, పాటలు: వెనె్నలకంటి, ఎడిటింగ్: ఇ.ఎం.నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్.నారాయణ.