ఆకట్టుకునే చుట్టాలబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది హీరోగా, నమిత, యామిని హీరోయిన్లుగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమా ఎనభై శాతం టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథను తీసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 80 శాతం టాకీ పార్ట్ పూర్తిచేసుకొందని, జూన్ మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ, బ్యాంకాక్, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించామని, సినిమా బాగా వచ్చిందని, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని చెప్పారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, ఇంకా సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని, ఇంట్రడక్షన్ పాటను బ్యాంకాక్‌లో చిత్రీకరించామని అన్నారు. హీరోయిన్స్ మాట్లాతుతూ, తమకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పి సినిమా హిట్ కావాలని ఎదురుచూస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:నాగేంద్ర, ఆర్ట్:ఎస్.శేఖర్, నిర్మాత:వెంకట్ తలారి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.

chitram యామిని