నక్సలైట్‌గా భానుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిపల్లవి ఫిదా సినిమాలో తన అభినయంతో అందరినీ మనసు దోచుకుని తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సుస్థిరం చేసుకుంది. తీసిన మొదటి సినిమా అయినప్పటికీ నీది నాది ఒకే కథ లాంటి డిఫరెంట్ సినిమాను విభిన్న పద్ధతిలో తీసి, తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు వేణు ఊడుగుల. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. సాయిపల్లవి హీరోయిన్ అంటే లవ్‌స్టోరీలో నటనకు ప్రాధాన్యం వున్న క్యారెక్టర్స్ రాయటానికి దర్శకులు మొగ్గు చూపుతారు. కానీ దర్శకుడు వేణు మాత్రం సాయి పల్లవిని నక్సలైట్‌గా చూపించే సాహసం చేస్తున్నాడు. ఆమె నటనమీద వున్న నమ్మకంతోనే ఈ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్‌గా రూపొందబోతున్న ఈ నక్సల్ నేపథ్యం వున్న కథకు ‘విరాటపర్వం 1992’ అన్న టైటిల్ పరిశీలనలో వుంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఈ చిత్రంలో రానా కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు ఇన్‌ఫర్‌మేషన్ వచ్చింది. సాయిపల్లవి ఈ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుంటుందనడంలో ఆశ్చర్యం అయితే లేదు. ప్రస్తుతం పడి పడి లేచే మనసు ప్రమోషన్స్‌తో బిజీగా వున్న పల్లవి త్వరలోనే ఈ చిత్రంపై దృష్టిపెట్టనుంది. వేణు ఊడుగుల రెండో సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నాడనేది వేచి చూడాలి.