సారాకు మూడొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు శ్రద్ధా.. తరువాత దిశా.. ఇప్పుడు సారా. బాఘి సీక్వెన్స్ హీరోయిన్ల గురించేనని అర్థమైంది కదూ. ఔను, ‘బాఘి-3’ ప్రాజెక్టులో సారా అలీ ఖాన్ అవకాశం ఖరారైందట. తొలి ప్రాజెక్టు ‘కేదార్‌నాథ్’తో స్క్రీన్‌కు వచ్చిన సారా అలీ ఖాన్, అది షూటింగ్ జరుగుతున్న టైంలోనే ‘సింబా’లో చాన్స్ దక్కించుకుంది. ఈమధ్యే విడుదలైన ‘కేదార్‌నాథ్’లో మంచి నటనతో ఆకట్టుకున్న సారా, జూ.ఎన్టీఆర్ టెంపర్‌కు రీమేక్‌గా వస్తున్న ‘సింబా’ను పూర్తి చేసేసింది. డిసెంబర్ 28న సింబా థియేటర్లకు వస్తోంది. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్టునూ సారా కన్ఫర్మ్ చేసుకుంది. అరంగేట్రం ప్రాజెక్టుతోనే అభిమానులను సంపాదించుకున్న సారా, వరుస ప్రాజెక్టులతో ఊపుమీద ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హిట్టు చిత్రంగా నిలిచిన వర్షం’కు రీమేక్‌గా బాఘి రావడం తెలిసిందే. టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకఫూర్ జంటగా వచ్చిన చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో, తరువాత సీక్వెల్ తీసుకొచ్చారు. సీక్వెల్‌లో టైగర్ ష్రాఫ్‌తో దిశాపటానీ జోడీకట్టింది. సీక్వెల్ సైతం మంచి హిట్టుగా నిలవడంతో ఇప్పుడు బాఘి-3కి ప్రణాళికలు సిద్ధమయ్యాయట. ఈ సీక్వెల్‌లో సారా అలీ ఖాన్ అలరించనుంది.