మళ్లీ భయపెడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దక్షిణాదిలో హారర్ సినిమాల హవా జోరు ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు క్రేజీ హీరోయిన్లు సైతం సై అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంచలన తార నయనతార ఇటీవలే ‘మాయ’ (మయూరి) సినిమాతో భయపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ తెలుగులో వెంకటేష్ సరసన నటించేందుకు సిద్ధమైంది. తాజాగా తమిళంలో మరో హారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పింది నయనతార. ఇదివరకే ఆమె చేసిన ‘మాయ’ సినిమా ఇచ్చిన ఊపుతో ఈ సినిమాలో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తోంది. ‘కళవాని ఫేం సర్కుణమ్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతని శిష్యుడు దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ విని నయనతార షాక్ అయింది. వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పిందట. ప్రస్తుతం జీవా హీరోగా తిరునాళ్, విక్రమ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.