ఉంగరాల రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా మారిన సునీల్, తన సినిమా పేర్లను ఎన్నుకోవడంలో కొత్తదనం చూపిస్తుంటాడు. అలాగే ఆ పేర్లు కూడా అతనికి బాగా సూట్ అవుతున్నాయి. వీరూ పోట్ల దర్శకత్వంలో నటిస్తున్న ఓ సినిమాకు ‘వీడు గోల్డ్ ఎహె’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం వీరూ పోట్ల, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రాల్లోనే ఆయన నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రంలో సునీల్ జాతకాల పిచ్చి వున్న కోటీశ్వరుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర పేరు ఉంగరాల రాంబాబు. ఇదే పేరును సినిమా టైటిల్‌గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. త్వరలో చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటన ఇవ్వచ్చు.