అదరగొట్టిన మణికర్ణిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వీన్ కంగన చారిత్రక చిత్రం ట్రైలర్ విడుదలవ్వడంతోనే సెనే్సషన్ క్రియేట్ చేస్తుంది. మణికర్ణిక టైటిల్ రోల్‌లో కంగన ప్రదర్శించిన సాహస విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. కథా బీజం క్లియర్‌గా అర్థమయ్యే డైలాగులతో వచ్చిన ట్రైలర్ -ప్రాజెక్టుపై అంచనాలు పెంచేదిగానే ఉంది. ‘లక్ష్మీబాయి అనే నేను.. శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీని కాపాడతానని మాటిస్తున్నాను’ అంటూ రాణీ బాధ్యతల స్వీకార ఘట్టంలో కంగన హావభావాలు ఆకట్టుకున్నాయి. కంగన టైటిల్ రోల్‌లో నటిస్తున్న చారిత్రం చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విడుదల చేసిన ట్రైలర్‌లో లక్ష్మీబాయిలోని వీరత్వం, ధైర్యసాహసాలు, నృత్యం, లాస్యం, ప్రేమతత్వం.. ఇలా భిన్న కోణాలను స్పృశించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రానికి, కొద్ది భాగాన్ని అనివార్య కారణాల్లో కంగనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రాజెక్టు -ఎట్టకేలకు పూర్తి చేశారు.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రంలో -క్లుప్తంగా కథ అర్థమయ్యేలా కాస్త ఎక్కువ నిడివితోనే ట్రైలర్ విడుదల చేయడం గమనార్హం. బ్రిటీషర్ల కన్నుపడిన ఝాన్సీని రక్షించేదెవరోనంటూ ఆందోళన పడుతున్న సమయంలో, ‘నేను ఇందాక ఓ అమ్మాయిని చూశాను. పేరు మణికర్ణిక’ అని చెప్తున్న డైలాగ్‌పై కంగన పులిని వెటాడే సన్నివేశాన్ని చూపించారు. కత్తిసాము శిక్షణ సమయంలో వ్యక్తులపైనుంచి వేగంగా పరిగెత్తి మదపుటేనుగును అధిరోహించిన సన్నివేశం ఆకట్టుకునే తీరులో ఉంది. మణికర్ణిక ఆవేశంగా వస్తూ ఎదురొచ్చిన సహాయకురాలినుంచి బిడ్డను తీసుకోవడం, ఝాన్సీకి కాపాడటం కోసం బిడ్డ, భర్తలను కొల్పోవడం, యుద్ధంలో బ్రిటీషర్లను చీల్చి చెండాడిన దృశ్యాలు కంగన పాత్రోచిత నటనా ప్రతిభకు అద్దం పడుతున్నాయి. మణికర్ణి: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.