స్నేహంతో కమిట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్, శ్రీరాం, నవీన్, రాధిక, ఆరోషి నాయుడు, ప్రతిభక్ష ప్రధాన తారాగణంగా స్వామి చంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల రూపొందించిన చిత్రం ‘కమిట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో ప్రతాని రామకృష్ణ గౌడ్ తొలి సీడిని విడుదల చేసి సాయి వెంకట్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, స్నేహబంధం నేపథ్యంలో సాగే ఈ అందమైన కథగా ఈ చిత్రాన్ని రూపొందించామని, దూరమైన తన స్నేహితులతో కలిసి ఆడి పాడాలని, వారితో శాశ్వతంగా గడపాలని ఓ ఆత్మ పడిన ఆరాటమే ఈ చిత్ర కథాంశమని తెలిపారు. నేపథ్య సంగీతం హైలెట్‌గా సాగే ఈ చిత్రం సమిష్టి కృషితో తెరకెక్కిందని, అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:ఐలేష్‌కుమార్, నిర్మాత:పట్నాల రాంబాబు, దర్శకత్వం:స్వామిచంద్ర.