సర్దార్ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్, కాజల్ జంటగా పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి., ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకాలపై సంయుక్తంగా కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా రూపొందిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, సెన్సార్‌వారు చిత్రాన్ని చూసి యు/ఎ సర్ట్ఫికెట్ అందించారని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, దాదాపు 40 మంది నటీనటులతో వంద గుర్రాలతో, వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో రూపొందించిన ఈ చిత్రం నిర్మాణ పరంగా హై టెక్నికల్ విలువలతో రూపొందిందని, హైదరాబాద్, బరోడా, రాజ్‌కోట్, కేరళ, మల్షాజ్‌ఘాట్స్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని, పవన్ కళ్యాణ్ అభిమానులకు విందు భోజనంలా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని వారు తెలిపారు. ఏప్రిల్ 8న విడుదలకానున్న ఈ చిత్రంలో శరద్ కేల్కర్, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, కృష్ణ్భగవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, లక్ష్మీరాయ్, షకలక శంకర్, సుడిగాలి సుధీర్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:ఆర్డర్ విల్సన్, ఎడిటింగ్:గౌతంరాజు, ఆర్ట్:బ్రహ్మకడలి, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, దర్శకత్వం:కె.రవీంద్ర (బాబీ).