అలాంటివే కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటే రకరకాల పాత్రలు వేయడానికి సిద్ధంగా ఉండాలని, కానీ మనకు నచ్చిన పాత్రలు లేక మన ఒరిజినాలిటీని చూపించే పాత్రలు వస్తే ఆ కిక్కేవేరని అంటోంది లావణ్యాత్రిపాఠి. ఇప్పటికే మిథునగా, నందనగా, సీతగా ఆమె నటించిన చిత్రాల్లో గుర్తింపు పొందింది. కానీ లావణ్యగా గుర్తింపు కావాలనీ, అలాంటి పాత్రలు కోసం చూస్తున్నానని అంటోంది. నన్ను నన్నుగా ప్రేక్షకులు గుర్తించాలి గానీ ఏ మిథునగానో, ఏ నందనగానో, ఏ సీతగానో గుర్తింపు వద్దని అంటోంది. అందుకే అందరూ యువ హీరోలతోనే నటించడానికి సిద్ధమయ్యానంటోంది. ఎందుకంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నటించే సమయంలో ఓ సీనియర్ హీరోకి భార్యగా నటిస్తే కెరీర్‌లో అలాంటి పాత్రలే వస్తాయని తనను భయపెట్టినా, అలాంటివి పట్టించుకోకుండా తాను నటించానని, తన నమ్మకం వమ్ముకానందుకు సంతోషంగా వుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన ఒరిజినాలిటీ చూపించే పాత్రలు కావాలని అంటోంది ఈ యువ నటి!

చిత్రం లావణ్యా త్రిపాఠి