పూర్తికావస్తున్న నాని చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ జరుగుతోంది. సురభి, నివేద థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే ఎలిమెంట్స్, రొమాన్స్, సెంటిమెంట్, వినోదం లాంటివన్నీ ఉంటాయని, త్వరలోనే పేరును ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్, కోడైకెనాల్‌లో షెడ్యూల్స్ జరిపామని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలుపెట్టామని, ఈనెల 6వరకు జరుగుతుందని తెలిపారు. ఈనెలలోనే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి, మే నెలాఖరుకుగానీ, జూన్ మొదటివారంలోగానీ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.