పవన్‌కు నచ్చిందట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పవన్‌కళ్యాణ్‌కున్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన సరసన హీరోయిన్‌గా నటించాలని చాలామంది హీరోయిన్లు తహతహలాడుతూంటారు. ఈ విషయంపై చాలామంది పవన్‌తో నటించాలనుందనే విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లక్ష్మీరాయ్‌కు మాత్రం ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలో ఈమె ఓ ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే ఆ పాటను కూడా చిత్రీకరించారు. దాంతోపాటు ఓ పాత్రలోకూడా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ నటిస్తోంది. రెండో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకుందామా అని ఆలోచిస్తుండగా లక్ష్మీరాయ్‌కు అవకాశం ఇవ్వమని పవన్ స్వయంగా చెప్పారట.
దాంతో లక్ష్మీరాయ్ ఊహించని అవకాశం దక్కింది. ఈ సినిమా కోసం తన డేట్స్ కూడా ఆమె సర్దుబాటు చేసుకుంది. మొత్తానికి అందాల భామ లక్ష్మీరాయ్‌కి ఈ సినిమాతో దశ తిరిగేటట్టే కనిపిస్తోంది!