మూడు భాషల్లో అభినేత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా కథానాయికగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం అభినేత్రి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ ఈనెల 15న వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తన కెరీర్‌లో తొలిసారిగా టైటిల్ రోల్‌లో నటిస్తున్నానని, ‘బాహుబలి’, ‘బెంగాల్ టైగర్’, ‘ఊపిరి’లాంటి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఆనందం కలుగుతోందని తెలిపారు. ఈ సినిమాలో పాత్రను దర్శకుడు చెప్పినప్పుడు నచ్చి మూడు భాషల్లో నటించడానికి సిద్ధమయ్యానని, తొలిసారిగా హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నానని, తన కెరీర్‌లో ఓ సెనే్సషనల్ మూవీగా నిలుస్తుందని అన్నారు. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమన్నాకు ఈ చిత్రం మంచి సినిమాగా నిలుస్తుందని, మొదటి షెడ్యూల్ రాజమండ్రి దగ్గర ఓ గ్రామంలో జరిపామని, రెండో షెడ్యూల్ బొంబాయిలో చేసి, ఇప్పుడు వైజాగ్‌లో మూడో షెడ్యూల్ చేయడానికి సిద్ధవౌతున్నామని, జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. సోనూసూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వి, షకలక శంకర్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, సంగీతం: ఎస్.ఎస్.్థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా: మనీష్‌నందన్, ఎడిటింగ్: ఆంటోనీ, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్.

చిత్రం తమన్నా, ప్రభుదేవా