నటుడిగా ప్రూవ్ చేసుకోవాలి: వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన ‘లజ్జ’ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించాడు యువ నటుడు వరుణ్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌న్యూస్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
‘మాది వరంగల్ జిల్లాలోని హన్మకొండ. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుంది. పదో తరగతిలో వున్నప్పుడే కొన్ని అవకాశాలు వచ్చాయి. మొదటిసారిగా నరసింహనంది దర్శకత్వంలో ‘లజ్జ’ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించాను. ఆ సినిమాలో నా నటన నచ్చడంతో ఆయన రూపొందించే ‘బుడ్డారెడ్డిపల్లిబ్రేకింగ్ న్యూస్’ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాను. దాంతోపాటు సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మనలో ఒకడు’ చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్రలో మూడు రకాల షేడ్స్ వుంటాయి. ఈ మూడు సినిమాలు నాలోని నటుడికి గుర్తింపునిస్తాయనే నమ్మకంవుంది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని వుంది. ప్రస్తుతం బిటెక్ మొదటి సంవత్సరం చేస్తున్నాను. ఇప్పటికే మరో రెండు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. తెలుగులో చాలామంది హీరోలంటే ఇష్టం. ముఖ్యంగా అజిత్ అంటే బాగా ఫాలో అవుతాను. నటనలో సత్యంయాబి దగ్గర శిక్షణ తీసుకున్నా. అలాగే డాన్సు, ఫైట్స్ అన్ని రకాలుగా తర్ఫీదు పొందాను. కమర్షియల్ సినిమాల్లో చేస్తూనే అన్ని రకాల పాత్రల్లో నటించాలని వుంది అని అన్నారు.