త్వరలో కమిట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్, శ్రీరామ్, నవీన్, రాధిక ప్రధాన పాత్రల్లో స్వామిచంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల నిర్మిస్తున్న చిత్రం కమిట్‌మెంట్. ఐలేష్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ ఆకట్టుకునేలా వుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు స్వామిచంద్ర మాట్లాడుతూ.. స్నేహబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. దూరమైన స్నేహితులతో కలసి ఆడిపాడాలని, వాళ్లతో శాశ్వతంగా గడపాలని ఒక ఆత్మ పడిన ఆరాటమే ఈ సినిమా. ఐలేష్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.