మోదీ.. ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ గురించి గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందని వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర పోషిస్తారని ప్రచారమైంది. తాజాగా ఈసినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ లాంఛ్‌చేశారు. నరేంద్ర మోదీగా ఒబెరాయ్ లుక్ ఎలా వుంటుందో పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. తొలి పోస్టర్‌ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లాంచ్ చేశారు. మొత్తం 23 భాషల్లో ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ వివరాల్ని ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ‘‘వివేక్ ఆనంద్ ఓబెరాయ్ (వివేక్ ఓబెరాయ్) నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తున్నారు. టైటిల్ పిఏం నరేంద్ర మోదీ. 23 భాషల్లో ఈ చిత్రం వస్తుంది. అన్ని భాషల్లో పోస్టర్లను సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ లాంచ్ చేశారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సురేష్ ఓబెరాయ్- సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు అని తెలిపారు.