శివ కందుకూరి సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల పెళ్లిచూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇపుడు ధర్మపథ క్రియేషన్స్‌పై మరో లేడీ డైరెక్టర్‌ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు. అందులో తన కుమారుడు శివ కందుకూరి హీరోగా కనిపించబోతున్నారు. శివ కందుకూరి అమెరికాలో చదువు పూర్తిచేసుకుని ఈమధ్యే ఇండియాకి వచ్చారు. ఇంతకుముందు ప్రముఖ దర్శకులు సుకుమార్ మరియు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శేష సింధురావ్‌ని ఈ చిత్రంతో దర్శకురాలుగా కందుకూరి పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన 96 చిత్రం ఫేమ్ వర్ష ఇందులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. మహానటి చిత్రానికి స్క్రీన్‌ప్లే మరియు మాటలు అందించిన పద్మావతి విశే్వశ్వర్ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. రవితేజ గిరజాల ఈ చిత్రానికి ఎడిటర్. వేద రామన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు మరియు మధుర శ్రీ్ధర్‌లు ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.