రజనీతో రాజవౌళి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఇక రెండు మూడు సినిమాలకంటే ఎక్కువ నటించే అవకాశం లేదని చాలాకాలం క్రితమే కథనాలు వచ్చాయి. ‘కబాలి’ తర్వాత ‘కాలా’ ఒప్పుకున్నప్పుడు దాదాపుగా అదే చివరి సినిమాగా ప్రచారం సాగింది. కానీ ఆ సినిమా పూర్తయ్యేలోపు ‘పెట్టా’ అన్నాడు. ‘పెట్టా’ విడుదలయ్యేలోపు మురుగదాస్ సినిమాను లైన్లో పెట్టాడు. రజనీ పొలిటికల్ పార్టీ, ఆయన ఆధ్యాత్మిక విషయాల సంగతేమోగానీ కోలీవుడ్‌లో వినిపిస్తున్న కొత్త టాక్ -మురుగదాస్ సినిమా తర్వాత మరోసారి ‘పెట్టా’ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో సినిమా చేస్తాడని. అక్కడితో ఆగడట, ఆ సినిమా పూర్తికాగానే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజవౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. రజనీ ప్రస్తుత కమ్మిట్‌మెంట్లు పూర్తయ్యేలోపు రాజవౌళి ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి చేస్తాడని, ఈ క్రేజీ ప్రాజక్ట్ తర్వాత రాజవౌళి నెక్స్ట్ సినిమా రజనీతోనే ఉంటుందని అంటున్నారు. ఎంతవరకూ వర్కౌటౌతుందో చెప్పలేంగానీ, కాంబో కనుక ఫిక్సయితే ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.