పండగంతా వినోదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ఎఫ్2, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతోంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరోయన్ మెహరీన్ మాట్లాడుతూ దర్శకుడు అనీల్ రావిపూడి నానుండి మంచి నటన రాబట్టారు. పాత్రకోసం హార్డ్‌వర్క్ చేశాను. నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌తో నేను చేస్తోన్న రెండో సినిమా. తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. ఇందులో ఫన్ మాత్రమే ఉంటుందన్నారు. తమన్నా మాట్లాడుతూ దిల్‌రాజు బ్యానర్‌లో ఎప్పటినుండో ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నా. కొన్ని అవకాశాలు వచ్చినా కుదరలేదు. ఇప్పుడు ఇంత మంచి ప్రాజెక్టులో భాగం చేసినందుకు దిల్‌రాజుకు థాంక్స్. కామెడీ సినిమాల్లో రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ ఆధారంగా కామెడీ ఉంటుంది. వెంకీ చాలా ఏళ్లుగా నన్ను ఇన్‌స్పైర్ చేస్తున్నారు. ఆయనింకా ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనపడుతున్నారనేది ఇప్పటికే పజిలే. వరుణ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. త్వరగా ఎఫ్3 చేయాలని కోరుకుంటున్నానన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ రాజా ది గ్రేట్ తర్వాత ఏ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు అనీల్ ఈ ఐడియా చెప్పాడు. అనీల్‌తో ఇది మూడో సినిమా. వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహరీన్ సహా ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కనపడుతుంది. సంక్రాంతికి ఎఫ్2 అందరికీ ఫన్ ఇస్తూ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ వచ్చాను. ఆ క్రమంలో కామెడీ కూడా చేయాలనుకున్నా. వెంకీ కామెడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో చేయడమంటే కాస్త టెన్షన్ పడ్డాను. కానీ, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ముందుగా అనీల్‌కి థాంక్స్. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తర్వాత ఫుల్‌ప్లెడ్జ్‌డ్ కామెడీ సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత అలాంటి సినిమా ఎఫ్-2 చేశాను. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అన్నారు.