షోలే.. షోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగ వినోదానికి తెరలేచింది. సంప్రదాయ సంక్రాంతిని వేడుక చేసేందుకు మూడు అచ్చ తెలుగు సినిమాలు థియేటర్లను పంచేసుకున్నాయి. ఆడియన్స్‌ని అలరించేందుకు అనువాద చిత్రాలూ వస్తున్నా -వాటికి మాత్రం థియేటర్ల కొరత తప్పడం లేదు. ఎప్పుడూవుండే వివాదాన్ని ఒకింతసేపు పక్కన పెడితే -సంక్రాంతి సెలవుల్ని ఎంగేజ్ చేయడానికి వస్తున్న సినిమాలన్నీ పెద్ద సినిమాలే కావడం ఇక్కడ విశేషం. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ల మీద ఫస్ట్‌లుక్‌లు, టీజర్లు, ప్రోమోల మీద ప్రోమోలు, ట్రైలర్లు, ప్రమోషన్ టూర్లు పూర్తి చేసుకుని -స్క్రీన్‌కు వచ్చేందుకు సినిమాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వారంపాటు తెల్లారింది మొదలు చీకటి పడేంత వరకూ సినిమాయే ఎంటర్‌టైన్ చేయబోతోంది. పండుగ సినిమాగా మొదట యన్‌టిఆర్ బయోపిక్‌లోని ‘కథానాయకుడు’ ఈరోజు థియేటర్లకు వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాలే అయినా -ఏపీలో సంక్రాంతికంటూ ఓ ప్రత్యేకత ఎప్పుడూ ఉండేదే. ఈ కోణంలో అక్కడ ప్రదర్శితమవుతున్న చిత్రాలకూ ప్రత్యేక ‘షో’ అనుమతులూ లభించేశాయి. యన్‌టిఆర్ పాత్ర పోషిస్తూ బాలకృష్ణ చేసిన ‘కథానాయకుడు’ ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ సర్కారు ఇప్పటికే అనుమతించింది. దాదాపుగా 18వ తేదీ వరకూ ఈ చిత్రం రోజుకు ఆరు షోలు చొప్పున ప్రదర్శితం కానుంది. ఇక 11వ తేదీన విడుదలవుతున్న మెగా హీరో రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రానికి ఏపీలో ప్రత్యేక అనుమతులు దొరికాయి. ఈ చిత్రం సైతం 18వ తేదీ వరకూ అన్ని థియేటర్లలో రోజుకు ఆరు షోలు చొప్పున ప్రదర్శించనున్నారు. మరుసటి రోజే అంటే పండుగ ముందురోజున వెంకటేష్, వరుణ్ తేజ్‌లు -పండుగ అల్లుళ్లుగా థియేటర్లకు రాబోతున్నారు. మిలియన్ల వ్యూస్ తమ ట్రైలర్లకు దొరికాయంటూ పెద్దగా ప్రచారం చేసుకున్న చిత్రాలు -ఎన్ని ఆడియన్స్‌ని అలరిస్తాయో చూడాలి. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు బరిలో ఉండటంతో, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన పేట, మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ చిత్రాలకు థియేటర్ల కొరత తప్పడం లేదు. ఇవి ప్రేక్షకులకు అందుబాటులో లేనట్టేనని చెప్పాలి.