ఇమేజ్ గురించి ఆలోచించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడుచేసుకోకూడదని అంటున్నాడు ప్రముఖ నటుడు వెంకటేష్. ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్‌తో కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా
వెంకటేష్‌తో ఇంటర్వ్యూ...
* ఫన్ ఎవరికి? ఫ్రస్టేషన్ ఎవరికి?
- ఇందులో ఉండే ఫన్, ఫ్రస్టేషన్ ప్రేక్షకులను నవ్వించేందుకే. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సరిగ్గా సంక్రాంతి పండగకు కావలసిన సినిమా.
* ఇంతకీ కథ ఏమిటి?
- పెళ్లికి ముందు పెళ్లి తరువాత మగవాడి జీవితం ఎలా వుంటుందన్న పాయింట్‌తో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన కథ. ప్రతీ మనిషికి కనెక్ట్ అవుతుంది. ఇందులో చూసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి.
* గురు తరువాత గ్యాప్‌కు కారణం?
- ఆ సినిమా తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా చేద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు. మళ్లీ రెగ్యులర్ ఫార్మెట్‌లో ఈ కథనే ఎంచుకున్నాను.
* వరుణ్‌తేజ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్?
- వరుణ్ మంచి నటుడు. తను ఇప్పటివరకూ ఇలాంటి జోనర్‌లో సినిమా చేయలేదు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి భిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నాడు. కొత్త జోనరైనా చక్కగా నటించాడు. తనతో పనిచేస్తూ ఎంజాయ్ చేశాను.
* ఇప్పటివరకూ పెళ్లికాని ప్రసాదుగా చూశారు. ఇపుడు పెళ్లైన ప్రసాదు సమస్యలు చూపిస్తారా?
- మల్లీశ్వరిలో పెళ్లికాని ప్రసాదు పాత్ర బాగా గుర్తుండిపోయింది జనాలకు. ఈ సినిమాలో కూడా నా పాత్రకు మంచి ఇంపాక్ట్ వుంటుంది. పెళ్లైన తరువాత మగవాడి జీవితం ఎలా వుంటుందనేదాన్ని కామెడీగా చూపించాము.
* దర్శకుడు అనీల్ గురించి?

- అనీల్ క్లారిటీ వున్న దర్శకుడు. ఈ కథను చెప్పినపుడు అందులో వున్న ఫన్‌ను బాగా ఎలివేట్ చేశాడు. తను సెట్స్‌లో కూడా అంతమంది ఆర్టిస్టులను డీల్ చేయడంలో ఎక్కడా తడబడలేదు.
* మీ కెరీర్‌లో ఇమేజ్ కోసం చేసిన సినిమాలున్నాయా?
- ఇమేజ్ అనేదాన్ని నేను నమ్మను. నేను ఇలాంటి పాత్రలే చేస్తాను, ఇలాగే వుంటానంటే ఇక్కడ కుదరదు. అన్నిరకాల పాత్రల్లో మెప్పించినపుడే నటుడిగా పూర్తిస్థాయి గుర్తింపు దక్కుతుంది.
* ఎక్కువగా మల్టీస్టారర్లే చేయడానికి కారణం?
- అలా అని కాదు. మల్టీస్టారరా, సోలో సినిమానా అనేది ఆ కథల్ని బట్టి వస్తాయి. నా దగ్గరకు వచ్చిన బెస్ట్ కథలను చేస్తున్నాను.
* ఫ్యామిలీ చిత్రాల్లో మిమ్మల్ని ఎక్కువగా చూస్తున్నాం. దానికోసం ప్రత్యేక కేర్ తీసుకుంటారా?
- నాకన్నీ అలాంటి కథలే వచ్చాయి. నిజానికి రోజా సినిమా సమయంలో నాకు గాయం అవ్వడంవల్ల ఆ సినిమా మిస్ అయ్యాను. ఆ తరువాత అన్ని ఫ్యామిలీ కథలు రావడంతో అలాగే కంటిన్యూ అయ్యాను. లేదంటే రోజా చేసి వుంటే హిందీలో సెటిల్ అయ్యేవాడినేమో.
* డ్రీమ్ పాత్రలు ఏమైనా ఉన్నాయా?
- అలాంటివి ఏమీ లేవు. మంచి పాత్రలకోసం చూస్తున్నా.
* వెంకీ మామ గురించి...
- చైతుతో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. తప్పకుండా మంచి సినిమా అవుతుంది.
* తదుపరి చిత్రాలు..?
- వెంకీమామతోపాటు త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఉంటుంది. అలాగే అనీల్ రావిపూడితో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నా. మరిన్ని కథలు కూడా వింటున్నా.

-శ్రీనివాస్ ఆర్ రావ్