మస్తానీకి బాజీరావ్ ప్రేమసందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ మరాఠా యోధుడు పేష్వా బాజీరావ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా ప్రమోషన్‌లో ఆ చిత్ర నటీనటులు సందడి చేస్తున్నారు. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నా యి. రెండురోజులుగా ముంబైలో వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ టీవీ షోలో పాల్గొన్న హీరో రణవీర్‌సింగ్, హీరోయిన్ దీపికాపదుకొనే రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమాలో బాజీరావ్‌గా రణవీర్‌సింగ్ నటిస్తుండగా అతడి రెండవభార్య ‘మస్తానీ’గా దీపిక నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారంనాటి కార్యక్రమంలో పాల్గొన్న రణవీర్‌సింగ్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన బాటిల్‌గ్రీన్ డ్రెస్‌తో మోకాళ్లపై కూర్చుని హీరోయిన్ దీపిక ప్రేమిస్తున్న విషయాన్ని ప్రపోజ్ చేసి, ఆమె ముంజేయిని సుతారంగా ముద్దాడిన దృశ్యం ప్రేక్షకులను అలరించింది. దీపికకూడా ప్రఖ్యాత డిజైనర్ అంజుమోదీ రూపొందించిన పింక్‌కలర్ సారీతో మెరిసిపోయింది. ఇక ఆధునిక దుస్తులతో మరో కార్యక్రమంలో వీరిద్దరూ సందడి చేశారు. ఈ చిత్రంలో బాజీరావ్ మొదటి భార్యగా ప్రియాంకచోప్రా కాశీబాయిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

chitram.. ‘బాజీరావ్ మస్తానీ’సినిమా ప్రమోషన్‌లో రణవీర్‌సింగ్, దీపికాపదుకొనే

-శ్రీ