దేవ్ వస్తున్నాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అది -హీరో సూర్య కొడుకు దేవ్ స్క్రీన్‌కు రానున్నాడని. అంత కొడుకున్నాడా? అన్న సందేహాలు వద్దు. ఎనిమిదేళ్ల వయసుకే ప్రధాన పాత్ర పోషించనున్నాడట. హీరోల కొడుకులు స్క్రీన్‌మీద ఆసక్తి చూపించడం కొత్తేమీ కాదు. ‘వర్మ’ చిత్రంతో విక్రమ్ కొడుకు ధ్రువ్ స్క్రీన్‌కు వస్తుంటే, స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ డైరెక్షన్‌పై ఆసక్తి చూపిస్తున్నాడు. కాకపోతే, కాస్త అర్లీగా సూర్య కొడుకు ట్రాక్ వేసుకుంటున్నాడంతే. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త దర్శకుడి సారథ్యంలో ఎనిమిదేళ్ల దేవ్ లీడ్ రోల్‌తో ఓ సినిమా డిజైన్ అయిపోయిందని వినికిడి. పెట్ డాగ్‌తో పిల్లాడికున్న అనుబంధం ప్రధాన ఇతివృత్తంగా చిత్రం ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టులతో ఆడిషన్స్ నిర్వహించి 30మందిని ఎంపిక చేశారని, వాళ్లతో సూర్య కుమారుడు లీడ్ రోల్ చేయవచ్చన్న కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించడమే తరువాయి.