ఈనెలలోనే పోలీసోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ కథానాయకుడుగా అట్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, కలైపులి ఎస్.్ధను అందిస్తున్న చిత్రం పోలీసోడు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘తుపాకీ’ వంటి చిత్రంతో మంచి ఫామ్‌లో వున్న విజయ్‌తో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ సినిమాకు పోలీసోడు అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేశామని తెలిపారు. ఈనెలలోనే ఆడియో విడుదల త్వరలో నిర్వహించి, సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. సమంత, అమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ప్రభు, రాధిక, మహేంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జి సి.విలియమ్స్, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, ఎడిటింగ్: ఆంథోనీ రూబెన్, నిర్మాతలు: రాజు, కలైపులి ఎస్.్ధను, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అట్లి.